sri Shankara chidvilasamu    Chapters   

శ్రీశంకర భగవత్పాదుల జననకాలము

-ప్రమాణ వచనములు-

1) శ్రీ చిత్సుఖాచార్య విరచిత ''బృహచ్ఛంకర విజయం 32వ ప్రకరణము

(12) తతస్సాదశ మేమాసే సంపూర్ణ శుభలక్షణ |

షడ్వింశేశతకే శ్రీ మద్యుధిష్థరశకస్యవై ||

(13) ఏకత్రింశే7ధవర్షేతుహాయనే నందనే ళుభే |

మేషరాశిం తే సూర్యే వైళాఖేమాసి శోభ##నే||

(14) శుక్లపక్షేచ పంచమ్యాంతిథ్యాం భాస్కరవాసరే |

పునర్వసు గతే చంద్రే లగ్నే కర్కట కాహ్వయ్‌||

(15) మధ్యాహ్నేచాభి జిన్నామ ముహూర్తే శుభవీక్షితే |

స్వోచ్చస్థే కేంద్రసంస్థేచ గురౌ మందే కుజేరవౌ

(16) నిజతుంగగతే శుక్రే రవిణాసంగతే బుధే |

ప్రాసూత తనయం సాధ్యేగిరిజేవషడాననం ||

2) శ్రీ వ్యాసాచల కవి విరచిత ''విజయ కావ్యం''

4వ అధ్యాయం.

(20) అబ్దేకలేరనలవర్ష శరాక్షిసంఖ్యే

శ్రీనందనే దినమణావుద గధ్వభాజి |

రాధే7ధి పంచమితిధావసితేతరాయాం

వారేరవేరదితిభే శుభయోగయుక్తే ||

(21) లగ్నే శుభేశుభయతే సుషువే కుమారం

శ్రీ పార్వతీవ సుఖినీ శుభవీక్షితేచ |

జాయాసతీ శివగురోర్నిజంతుగసంస్థే

సూర్యే కుజే రవి సుతేచ గురౌచకేంద్రే ||

3) ఆనందగిరి పణీత ''వ్రచీన శంకర విజయం'' 3వ సర్గ.

(36) తిష్యే ప్రయాత్యనలశేవధి బాణనేత్రే

యోనందనే దినమణావుద గధ్వభాజి |

తాధే7ది తేరుడు ని నిర్గత మంగలగ్నే

7పాహూతవాన్‌ శివగురుస్సచ శంకరేతి ||

4) శివరహస్యం - 9 వ అంశ 10వ అధ్యాయం.

శ్లో|| మదంశజాతందేవే! కలావసి తపోధనం |

కేరళే షుతదావిప్రం జనయామి మహేశ్వరి||

శ్లో|| తసై#్యవచరితంతే7ద్య వక్ష్యామిశృణు శైలజే|

కల్యాదిమే మహాదేవి సహస్ర ద్వితయాత్పరం||

శ్లో|| కేరళే శశలగ్రామే విప్రపత్న్యాం మదంశతః||

భవిష్యతి మహాదేవి శంకరాఖ్యోద్విజోత్తమః ||

5) భవిష్యోత్తర పురాణం - 36వ అధ్యాయం

శ్లో|| కల్యాదౌ ద్వి సహస్రాంతే లోకానుగ్రహకామ్యయా |

చతుర్భిస్సహ శిషై#్యస్తు శంకరో7వతరిష్యతి||

6) కేరళీయ శంకర విజయం - 2వ అధ్యాయం.

(53) ప్రవృద్ధేతత్రచాసూత నందనం నందనే శుభే|

వైశాఖేమాసి పంచమ్యాం శుక్లపక్షే పనర్వసౌ||

(54) ప్రాదుర్భావే కుమారస్య లగ్నమాసీత్‌ సు శోభనం|

బలయుక్త శుభజ్యోతిస్సమారూఢ సమీక్షితం ||

(55) యేన సర్వజ్ఞతామేతి జాతవా& భువిమానుషః |

సయోగో7ప్య భూత్తస్య ద్విజపుత్రస్య సంభ##వే||

పై ప్రమాణములలో 1.2,3 ప్రమాణములనుబట్టి శ్రీ శంకర భగవత్పాదులవారు యుధీష్ఠిరశకము 2631 సంవత్సరములో, అనగా 50 బి.సి.లో నందన సంవత్సర వైశాఖ శుక్ల పంచమీ భానువారమున పునర్వసు నక్షత్రములో అభిజిన్ముహూర్తమున కర్కాటక లగ్నంలో శని, గురు, కుజ, శుక్ర, రవులను పంచ గ్రహములు ఉచ్చలోనుండగా అవతరించినా రని సృష్టమగుచున్నది. 4, 5 ప్రమాణములను బట్టి శంకరులు కలియుగములో 2000ల సంవత్సరములు, గడచిన తరువాత అవతరించినట్లును, 6వ ప్రమాణమువల్ల నందనవైశాక శుక్ల పంచమీ పునర్వసు నక్షత్రములో అవరతరించినట్లును కనపడుచున్నది. కనుక ఈ 4, 5, 6 ప్రమాణములు కూడా పై సిద్థాంతమునే బలపరుచుచున్నవి. ఇంకను ద్వారక పీఠ వృత్తాంతము, పూరీపీఠ వృత్తాంతము. కామకోటి పీఠ వృత్తాంతములనుబట్టికూడా శంకరుల జననకాలము పైవిధముగానే తేలుచున్నది.

శంకరులు 788 ఎడి,లో అవతరించినట్లు కొన్నిశ్లోకములు కన్పడుచున్నవి. కాని. ఆదిశంకరుల పిదప అఖినవశంకరులు అనువాడు 788 ఏ.డిలో జన్మించినట్లును. వారు శ్రీ కామకోటి పీఠములో 36వ ఆచార్యులు అయినట్లును శ్రీ కామకోటిపీఠ వృత్తాంతమును బట్టి తేలుచున్నది. కనుక 788 ఎ.డి. అనునది ఆదిశంకరుల జననకాలము కానేరదు.

పై ప్రమాణములకు విరుద్ధముగ కన్పడు ఆధునికుల అభిప్రాయము లన్నియు ఊహగానములే కనుక అవి ప్రమాణములు కానేరవు.

శ్రీ శంకరులు - జగద్గురువులు

శ్రీ శంకరులయొక్క గొప్పతనము తెలిసికొనవలెననన్న వా రవతరించనిచో దేశపరిస్థితి యెట్లుండెడిదో ఊహించిన తెలియగలదు. అర్ధశాస్త్రము (Economics) ప్రకారము ఒక వస్తువుయొక్క విలువ దాని అభావములో తెలియను. The value of a thing is known in its absenece అని చెప్పబడినది కదా ! కన్నును ప్రతివాడును నిత్యము వాడుకొనుచున్నప్పుడు దాని విలువ అంతగా తెలియదు ఆ కన్ను పోయి గ్రుడ్డివాడైన పక్షము దాని విలువ పూర్తిగా తెలియును. అటులనే నీటిని మనము స్వేచ్ఛగా వాడుకొన్నంతవరకు నీటియొక్క వలువ తెలియదు. ఒకనాడు నీటికుళాయిలన్నియు బందయిన్నప్పుడుగాని యెడారి ప్రదేశములో నున్నప్పుడుగాని నీటి విలువ తెలియును ఆ విధము గానే శంకరులవారు అవతరించనిచో మన హిందూదేస్థితి యెట్లుండెడిదో విచారించిన శంకరుల అవతారపు విలువ మనకు తెలియగలదు శంకరుల వారు అవతరించు కాలమున మన దేశము బౌద్ధమయమై యుండెను. శంకరులవతరించనిచో మనమందరము బౌద్ధమతములో నుండెడివారము ఇప్పుడు చైనాదేశ మే స్థితిలో నున్నదో అట్టి స్థితిలో నుండెడివారము.

అట్లుకాక శంకరు లవతరించి బౌద్ధమతమును ఖండించి మన దేశములో ఆ మతము లేకుండ జేయుటచేత మనము వేదశాస్త్రములను ప్రమాణముగా జేసికొని దేవుడున్నాడని నమ్ముచు, ఆ దేవుని అవతారములను పూజించుచు రామాయణ, భారత, భాగవత గ్రంథ పురాణ కాలక్షేపములను, ఉత్పవాదులను జేయుచు, భగవదనుగ్రహమునకు పాత్రులము కాగలుగుచున్నాము ఇట్టి మహోన్నతమైన స్థితి మన కబ్బుటకు కారణము శంకరుల యొక్క అవతారమే కనుక హిందూదేశములోనున్న హిందువు లందరు అనగా వేదమతానుయాయు లందరు శంకరులకు నీ విధముగా ఋణపడి యున్నారు. కనుక శంకరులను పూజించవలసి యున్నది. ఈ విధముగా మన హిందువు లందరికి శంకరులు గురువులే.

జగద్గురుత్వము

శంకరులు జగద్గురువుటనుటలో రెండు భావము లుండియున్నవి.

(1) శంకరులే జగద్గురువులు.

(2) శంకరులు జగద్గురువులే. అను రెండు అవధారణలు ఉండి యున్నవి. మొదటిది అన్యయోగ వ్యవచ్ఛేదకము. రెండవది అయోగ వ్యవచ్ఛేధకము, అనగా మొదటి భావము ప్రకారము శంకరులే జగద్గురువులు. యితరులు కారని అర్థము. రెండ భావము ప్రకారము శంకరులు జగద్గువురులఅఉ కాకుండ నుండుటలేదు. అనగా వారిలో జగద్గురుత్వము నిత్యసిద్ధమని అర్థము.

ఇది యెటులనగా-జగద్గురువనగా జగమంతకును గురువు. జగత్తులో ప్రధానముగా మూడు మతములున్నవి అవి క్రిష్టియన్‌ మతము, ముసల్మానుమతము. హిందూమతము అనునవి. శంకరులు జగద్గురువులని అనుటలో అర్థము హిందూవులకే కాక క్రిష్టియనులకు, ముసల్మానులకు గూడ గురువులే గురువను శబ్దమునకు అర్థము. అజ్ఞనమునుపోగొట్టి జ్ఞానమును కలుగజేసి మోక్షమునకు త్రోవచూపువాడు. శంకరులు ప్రతిపాదించిన ఉపనిత్సిద్ధాంతము ప్రకారము ఆత్మజ్ఞానము వలన మోక్షము కలుగును ''తరతిశోక మాత్మవిత్‌'' అని ఉపనిషత్తు చెప్పుచున్నదిగదా !

ప్రతి మానవుడును ''నేను, నేను'' అని తననుగురించివ్య వహరించుకొనును. ఆ ''నేను'' అనుదానికి అర్థము సామాన్యాకారముగ ప్రతి వారికిని తెలసునేగాని. విశేషాకారమున తెలియదు విశేషాకారము అనుభనములోనికి వచ్చుటయే మోక్షము. ఇట్టి ఆత్మజ్ఞానము అనగా స్వస్వరూప జ్ఞానము కలిగిన వారందరికీ మోక్షము వచ్చును. అట్టివారు ఇట్లు యేమతమునకు చెందినవారైనను సరే. వారు మోక్షమునకు అందలు అర్హులే. ఇట్లు శంకరులు ఆత్మజ్ఞానము పొందుటకును మోక్షమునకు అందలు అర్హులే అని తమ భాష్యములలో స్పష్టముగ చెప్పుటచేత వారు జగద్గురువులు.

ఇతరమతకర్తలు అట్లు చెప్పక తమతమ మతములలోనికి చేరితేనే (Conversion) మోక్షమనియు చేరనివారికి మోక్షములేదనియు, నరక మనియు చెప్పుదురు. కావున అటివారు జగద్గురువులు కానేరదు. ప్రపంచ మతకర్తలలో శంకరు లొక్కరే అట్లు చెప్పుటచేత శంకరులే జగద్గురువులని స్పష్టమగుచున్నది.

అట్టి శంకరుల సాంప్రదాయమునకు చెందిన శృంగేరి జగద్గురువులను క్రిష్టియనులు. ముసల్మానులునుగూడ తమకుగురువుగా నంగీకరించి అనేక విధముల గౌరవించిపూజించినారు. ఆ శృంగేరివారికి హైదరాలి, టిప్పుసుల్తాను మున్నగు మహమ్మదీయ ప్రభువులు అనేక గ్రామములనిచ్చి వారిని గురువులుగా పూజించినట్లు సనదులు ఉండియున్నవి. హైదరాబాదు పూర్వపు నవాబులున్నూ అట్లు శృంగేరివారిని గురువులుగా స్వీకరించి బంగారు పాలకీ, కిరీటము మున్నగు కానుకలు. స్థిరచరాస్తులిచ్చి గౌరవించినారు. మరియు 1953వ సంవత్సరములో కొందరు క్రిష్టియను మేధావులు తమకు గల ఆధ్యాత్మిక సందేహములు. తమ మతములో గాని ముసల్మాను మతలోగాని తీరుటకు నవకాశము లేక హిందూ మతమునకు ముఖ్యగురువులు. జగద్గురువులు నైన శృంగేరి చంద్రశేఖర భారతీ పూజ్యపాదుల వద్దకు వచ్చి సందేహముల నివారణ చేసుకొని బ్రహ్మానంద భరితులై జగద్గురుత్వము శంకరులకే చెల్లినదని యితరులకు లేదనియు సృష్టీకరించి తాము హిందూ మతములో జేరుటకు అనుజ్ఞ యివ్వవలసినదని కోరిరి అంతట శృంగేరివారు జెప్పినదేమనగా - జగత్తులోని వారందరును మా శిష్యులే మీరు క్రిష్టియనులుగను నున్నను. జగత్తులోనివారే గనుక మాకు శిష్యులు కాకపోరు మా మతము ప్రపంచమున కంతకు చెందిన మతము కనుక మా మతములోనికి చేరుట యనునది అవసరములేదు. మీరు క్రిష్టియను మతములో నున్నప్పటికి శంకర సిద్ధాంతము ననుసరించి ఆత్మజ్ఞానమును సంపాదించిన యెడల మోక్షము వచ్చునని శ్రీవారు సెలవీయగా ఆ క్రిష్టియను మేధావులకు ఆనందము మరియు నెక్కువయైనది. వారుభయులకు జరిగిన సంభాషణ అప్పటి హిందూపత్రికలో ప్రకటితమైనది.

ఇంకను శంకరుని జగద్గురుత్వమునుగూర్చి పాల్‌డ్యూసెస్‌. ఐసెన్‌బర్‌. గ్వినాన్‌, రోనాల్గ్‌షె మున్నగు అనేకమంది పాశ్చాత్య మేధావులును ముసల్మాను మతములోని సూఫీ శాఖవారును శంకర సిద్ధాంతము నునుసరించినవారే. అందుచేత శంకరులే జగద్గురువులని తేలినది.

ప్రపంచములోని మతములన్నియు, ద్వైతము, అద్వైతము అను రెండు భాగములుగానున్నవి. దేవుడు, జీవుడు వేరనియు. జీవుడు జీవుడు వేరనియు, ప్రపంచముసత్యమనియు చెప్పునవి ద్వైతమతములు. విశిష్ఠా ద్వైతము గూడ నిట్టి సిద్ధాంతములోనిదే. క్రిష్టియను మతము, ముసల్మాను మతములుగూడ ద్వైతసిద్ధాంతము లోనివే. పూర్వకాలములోని న్యాయవై శేషికములు మొదలగు దర్శనములును ద్వైతసిద్ధములోనివే. ఇట్టి ద్వైతసిద్ధాంతమును శంకరులు తమ భాష్యములలో ఖండించి అద్వైత సిద్ధాంతమును స్థిరపరచి దానికి పట్టాభిషేకము చేసిరి. అట్లు చేసియు అధ్వైత సిద్ధాంతము ఉత్తమాధికారులకే ఉపయోగించును కనుకను బహుసంభ్యాకులగు మందమధ్యమాధికారులకు ద్వైతసిద్ధాంతము అవసరమనియు గ్రహించి శైవ, వైష్ణవ, శాక్తేయాది షణ్మతములను గూడ ఉద్ధరించి ''షన్మతస్థాపకాచార్య'' అను సార్ధక బిరుదమును వహించినారు. ఈ విధముగా ద్వైతోపాసన అద్వైతమునకు సాధనగా గ్రహింపబడినది. ఇట్లు షణ్మతములను స్థాపించుటచేతగూడ జగద్గురుత్వము సార్థకమైనది.

శంకరులు సర్వజ్ఞ పీఠాధిరోహణమును చేయునపుడు, సరస్వతీదేవి వారిని పరీక్షించి, సంతోషించి వారికి ''సర్వజ్ఞ'' బిరుదమును ''జగద్గురు'' బిరుదమును అనుగ్రహించినది. కనుక శంకరులే జగద్గురువులని స్పష్టమైనది.

శంకరులు బోధించిన సిద్ధాంతముయొక్క స్వరూపమునుబట్టి శంకరులు జగద్గురువులే అనియు జగద్గురుత్వము వానిలోనిత్యసిద్ధమనియు స్పష్టమగుచున్నది.

sri Shankara chidvilasamu    Chapters